హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుప్త నిధుల తవ్వకాలు..12 మంది అరెస్ట్

SRPT: పెన్పహాడ్ మండలంలోని అనాజిపురం దర్గాలో గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్న 12 మంది ముఠా సభ్యులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో దాడులు నిర్వహించిన పోలీసులు ఒక కారు, 3 ద్విచక్రవాహనాలు, 12 సెల్‌ఫోన్లు, తవ్వకం పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.