హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్ మూసివేయాలి'

NLG: చిట్యాల(M) పెద్దకాపర్తిలో స.నం. 843/ఊ/2లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ప్లాంట్‌ను మూసివేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. పచ్చని పంట పొలాలు, ప్రార్థనా మందిరం సమీపంలో జీపీ తీర్మానం, పర్యావరణ అనుమతులు లేకుండా ప్లాంట్ నిర్మించారని ఆరోపించారు.