హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు 16 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి'

NLG: రైతులకు వ్యవసాయానికి రోజుకు 16గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ దేవరకొండ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాలు లేక రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.