ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి మాట్లాడుతూ.. గురజాడ రచనలు సామాజిక చైతన్యానికి దర్పణమని, “దేశమంటే మనుషులోయ్” సందేశం ఆదర్శమని పేర్కొన్నారు. వ్యాస, కవిత, వక్తృత్వ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ 164వ జయంతి వేడుకలు


