హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు

MDK: మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో భర్త మురళిని హత్య చేసిన భార్య విజయలక్ష్మికి జీవిత ఖైదు, రూ. 6 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో 2021 మార్చి 15న పడుకున్న భర్తపై రోకలి బండతో దాడి చేసి హతమార్చినట్లు వివరించారు. దీనిపై తాజాగా కోర్టు తీర్పు వెలువరించిందన్నారు.