JN: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షురాలు పడాల సంగీత, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణను కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సేవాదళ్ కమిటీలను బలోపేతం చేయడంపై చర్చించారు. పార్టీ కోసం పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సేవాదళ్ బలోపేతానికి కృషి


