BHPL: జిల్లాలో గ్రామాలు, పట్టణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో చెత్తను నాలుగు రకాలుగా విభజించి సేకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. తడి, పొడి, శానిటరీ, వైద్య వ్యర్థాలను వేర్వేరుగా నిర్దేశిత డస్ట్‌బిన్లలో వేయాలని తెలిపారు. వైద్య వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
చెత్తను నాలుగు రకాలుగా విభజించాలి: అ. కలెక్టర్


