MLG: నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2026–27లో రూ.6వేల కోట్లు విడుదల చేయనున్నట్లు, ఇప్పటికే రూ.2,550 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. పరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు. జిల్లాలో పనులను గడువులోపు పూర్తి చేస్తామని కలెక్టర్ సహదేవరావు మంత్రికి తెలిపారు.
తెలంగాణ
'భూసేకరణ పనులు వేగవంతం చేయాలి'


