NZB: చందూరు మండలం ఘనపూర్‌లో అక్రమంగా మొరం తవ్వకాలను ఆర్డీవో సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. చందూరు-ఘన్పూర్ శివారులో మొరం కోసం గుట్టను తవ్వుతున్నట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలించినట్లు ఆయన తెలిపారు. చందూర్, వర్ని తహశీల్దార్లను పిలిపించి గుట్టకు సంబంధించిన భూమిని సర్వే చేసి వివరాలు అందజేయాలని ఆర్డీవో ఆదేశించారు.
తెలంగాణ
అక్రమ మొరం తవ్వకాలను పరిశీలించిన ఆర్డీవో


