హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాదుల పైప్‌లైన్ లీకేజీ.. నీరు వృథా

BHPL: ములుగు మండలం జగ్గన్నపేట జీపీ అన్నంపల్లి శివారులో దేవాదుల పైప్‌లైన్ గేట్‌వాల్ లీకేజీ కావడంతో గోదావరి నీరు వృథాగా పోతోంది. రామప్ప-నల్లబెల్లి మండలం రంగాయి చెరువుకు నీటిని తరలించేందుకు గత ప్రభుత్వ హయాంలో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గేట్‌వాల్ లీకేజీతో నీరు వృథా అవుతోంది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.