KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో ఆరెపల్లి గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ వర్నె లావణ్య ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో డాక్టర్ కృష్ణారావు గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
ఆరెపల్లిలో ఉచిత వైద్య శిబిరం


