NGKL: తెలకపల్లి మండల కేంద్రం నుంచి నడిగడ్డ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించేందుకు వాహనాలను పక్కకు మళ్లించాల్సి వస్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరిగింది. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా మారిన నడిగడ్డ రహదారి


