AKP: మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ రచనల్లోని సామాజిక చైతన్యం, మానవతా దృక్పథం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారామ్, తహసీల్దార్ రమాదేవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండల పరిషత్ కార్యాలయంలో గురజాడ జయంతి


