హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహా ముత్తారంలో భూముల రీ-సర్వేపై గ్రామసభ

BHPL: మహా ముత్తారం మండలంలో భూముల రీ-సర్వేపై సోమవారం గ్రామసభ నిర్వహించారు. కాటారం డివిజన్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కొండగోర్ల బాపు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రీ-సర్వే ఉద్దేశాలను వివరించారు. భూముల హద్దులు, సర్వే నంబర్లు, రికార్డుల్లో లోపాలను సరిచేయనున్నట్లు తెలిపారు. రైతులు పాత పత్రాలు, పాస్‌బుక్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.