హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపైనే విద్యుత్ స్తంభాలు.. ఇబ్బందులు తప్పవు

JN: లింగాలఘనపురం మండలం వనపర్తి నుంచి దేవరుప్పుల మండలంకు వెళ్లే రహదారిపై 11 కేవీ విద్యుత్ లైన్ కోసం స్తంభాలను రోడ్డుపైనే ఏర్పాటు చేస్తున్నారు. డీటీఆర్ మంజూరు కావడంతో పనులు చేపట్టినప్పటికీ, భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు ఈ స్తంభాలు ఆటంకంగా మారే అవకాశం ఉందని వాహనదారులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి ప్రక్కన స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు.