BPT: అద్దంకి భవాని సెంటర్ సమీపంలోని నామ్ రోడ్డు దగ్గర పగిలిన తాగునీటి పైపులైన్‌కు సోమవారం అధికారులు మరమ్మతులు చేపట్టారు. పది రోజులుగా తాగునీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటి సరఫరా నిలిచిపోవడం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో జేసీబీ, ఇంజనీరింగ్ సిబ్బందితో మరమ్మత్తు పనులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అద్దంకిలో పైప్‌లైన్ లీకేజీకి మరమ్మత్తులు


