హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకున్న పోలేరమ్మ చిత్రం

తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర ఈ నెల 30, అక్టోబర్ 1న జరగనుంది. ఈ సందర్భంగా బంగారుపేటకు చెందిన చేనేత కళాకారుడు మురళీకృష్ణ మగ్గంపై పోలేరమ్మ ప్రతిమను రూపొందించారు. జాకార్డు యంత్రంతో జామ్దానీ పద్ధతిలో నూలు, గ్రాము బంగారంతో ప్రతిమను నేశారు. డిజైనర్‌గా నాగరాజు వ్యవహరించారు. గతంలో వేంకటేశ్వర స్వామి, గణనాథుడు, కృష్ణుడి చిత్రాలను కూడా మగ్గంపై నేశారు.