హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్'

కోనసీమ: రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌‌లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజల నుంచి 33 అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా విన్న మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌‌ను నిర్వహిస్తున్నామన్నారు.