హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు గన్నవరం విద్యార్థి ఎంపిక

కృష్ణా:  గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి గేదెల తేజ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. విజయవాడలో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో సెలక్షన్ కమిటీ అతడిని ఎంపిక చేసినట్లు హెచ్‌ఎం అవుతు సునీల తెలిపారు. కృష్ణా జిల్లా జట్టు తరఫున ఆడనున్న తేజను పీడీలు షేక్ మీరా, ధనియాల నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.