హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభించిన MLA

PDPL: ఓదెలలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి రేవంత్ సర్కార్ కృషి చేస్తోందన్నారు. విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్, ఎమ్మార్వో బి. వనజ, ఎంపీడీవో అనిల్ రెడ్డి ఉన్నారు.