హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మురుగు కాలువలు లేక అవస్థలు

VKB: బంట్వారం మండల కేంద్రంలోని 6వ వార్డులో మురుగు కాలువలు లేక వాడిన నీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగింది. గడ్డి పెరిగి విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలువల కోసం పనులు ప్రారంభించినా పూర్తికాలేదని తెలిపారు. అధికారులు స్పందించి మురుగు కాలువ నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.