హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని వినతి

JGL: రాయికల్‌ కొండపోచమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు తెలిపారు. దోమలు, పందుల బెడదతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. డ్రైనేజీ, మంచినీటి పైపులైన్‌, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.