హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

NRPT: మక్తల్ పట్టణంలో పడమటి ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, హిందూ సంఘాలు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.