ELR: జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ ఎంపీపీ పాఠశాలను యూపీ లేదా జడ్పీహెచ్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు కోరారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 5వ తరగతి పూర్తయ్యాక పై చదువుల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాలను అప్‌గ్రేడ్ చేయాలి'


