హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజేజేఏసీ జిల్లా అధ్యక్షుడిగా భావుసింగ్‌ నాయక్

KMM: ఏన్కూరు మండలం గార్ల ఒడ్డుకు చెందిన గుగులోత్‌ భావుసింగ్‌ నాయక్‌ తెలంగాణ జర్నలిస్ట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు తొంగరి కరుణాకర్‌ సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.