హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ కిందికి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి సేఫ్

VKB: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సోమవారం బైక్ అదుపుతప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు కాగా, వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.