WNP: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో గత కొంతకాలంగా తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు సైతం ఎండిపోవడంతో మహిళలు, చిన్నారులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ సరఫరాను పునరుద్ధరించాలని, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలన్నారు.
తెలంగాణ
తాగునీరు లేక.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు!


