WGL: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నగర ప్రజల నుంచి వివిధ సమస్యలపై కమిషనర్ వెంకన్న సోమవారం వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను కమిషనర్‌కు వివరించి పరిష్కరించాలని కోరారు. సంబంధిత అధికారులు వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా కమిషనర్ ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కమిషనర్


