హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు'

ATP: ఈ నెల 25న జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పిలుపునిచ్చారు. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో డీఆర్‌ఓ మలోల, DMHO వెంకటేశ్వర్లతో కలిసి ఆయన గోడ పత్రికలను విడుదల చేశారు. 1-19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, అక్టోబర్ 5న మాప్ అప్ నిర్వహిస్తామని తెలిపారు.