హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

 ఏలూరు: చెందిన హెడ్ కానిస్టేబుల్ పేరూరి శ్రీనివాసరావు (నూజివీడు రూరల్ పి.ఎస్) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. గతంలో ఏలూరు, పెదవేగి, చేబ్రోలు పరిధిలో సేవలందించిన ఆయన మృతి పట్ల పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.