హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: RDO కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా

AKP: నర్సీపట్నం RDO కార్యాలయం వద్ద ఏపీ ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ.. రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలో రెవెన్యూ అధికారులు గిరిజనల రికార్డులను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. వెబ్ ల్యాండ్‌లో గిరిజనుల పేర్లను తొలగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.