హైదరాబాద్: 28°C
తెలంగాణ

టన్నెల్‌ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

BDK: యాతాలకుంట వద్ద టన్నెల్‌ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్‌హౌస్‌ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్‌ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యం జరగవద్దని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.