హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

WGL: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం వరంగల్‌ కొత్తవాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు బాపూజీ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజ సేవను కొనియాడారు.