NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో లభించే మొలకలు, బెల్లం, ఆకుకూరలు, రాగులు, జొన్నలు తీసుకోవాలన్నారు. రాగులతో ఎముకలు, బెల్లంతో రక్తం పెరుగుతాయని తెలిపారు.
తెలంగాణ
'తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం తీసుకోవాలి'


