హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వల్లూరు మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాడ సాహిత్య సేవలు, సామాజిక సంస్కరణకు ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు.