హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD:​ నారాయణఖేడ్ మండలం చందాపూర్ గ్రామంలో MGNREGS కింద రూ. 5 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నేడు ప్రారంభించారు. గ్రామీణ రహదారుల అభివృద్ధితోనే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి అంతర్గత రహదారులు, ప్రాథమిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. సర్పంచ్ రుక్మిణి ఉన్నారు.