NTR: తిరువూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి 164వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి, సమాజ సంస్కరణకు గురజాడ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ నివాళులర్పించిన్న RDO


