హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినిస్టర్ క్వార్టర్స్‌లో పారిజాత మర్యాదపూర్వక భేటీ

RR: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన పారిజాత నరసింహారెడ్డి సోమవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియామకానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపి, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.