హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని 10వ బ్లాకులో రూ.12 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తున్నామని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.