KDP: సిద్ధవటం మండలంలోని చలమారెడ్డికొట్టాలు గ్రామం బీసీ కాలనీలో 65 కుటుంబాలు గత 15 రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇతర గ్రామాలకు వెళ్లి పంట పొలాల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి కోసం మహిళల నిరసన..!


