అన్నమయ్య: పెద్దమండ్యంలోని శ్రీ భవానీ శంకర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. గణేష్ నవరాత్రుల వేళ సోమవారం శివారాధన చేయడం శుభప్రదమని పుజారి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ భవానీ శంకర స్వామికి ప్రత్యేక పూజలు..!


