PPM: పాలకొండ శాఖా గ్రంథాలయంలో గురజాడ అప్పారావు 164వ జయంతి సోమవారం జరిగింది. 9వ సచివాలయ అడ్మిన్ కె. శివకృష్ణ గురజాడ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. గురజాడ సాహిత్యంతో సంఘ సంస్కరణకు కృషి చేశారని, 'కన్యాశుల్కం' ద్వారా వరకట్న దురాచారాన్ని ఎండగట్టారని, 'దేశమును ప్రేమించుమన్నా' గేయంతో దేశభక్తిని చాటారని కొనియాడారు. గ్రంథాలయ అధికారి గణేష్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొండలో గురజాడ జయంతి


