హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతల రోడ్డుకు మట్టితో మరమ్మతులు : సర్పంచ్

MDK: రామాయంపేట మండలం కాట్రియాల్‌–లక్ష్మాపూర్‌ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సర్పంచ్‌ కొత్త స్రవంతి రాజేందర్‌ గుర్తించారు. వెంటనే స్పందించి ట్రాక్టర్లతో మట్టి తరలించి గుంతలను పూడ్చించారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తగ్గాయి. సమస్యపై స్పందించిన సర్పంచ్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.