హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోత్కూర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు

BHNG: మోత్కూర్ పట్టణ కేంద్రంలో లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి మున్సిపాలిటీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కూరపాటి రాములు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యాదయ్య, కోశాధికారి రమేష్ నేత తదితరులు పాల్గొన్నారు.