హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి లేక నరకం చూస్తున్న రైతన్న!

మంచిర్యాల: రైతన్నలు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కన్నెపల్లి మండలం వీరాపూర్‌లో పొలాలకు వెళ్లే రహదారి వర్షాలకు అధ్వాన్నంగా మారింది. రహదారిపై నడుము లోతు నీరు చేరడంతో సాగు అవసరాలకు ఎరువులు, వ్యవసాయ సామాగ్రిని తీసుకెళ్లేందుకు రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎద్దులు బండ్లు సైతం బురదలో కూరుకుపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు.