హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారిలో చెత్త కుప్పలు.. చర్యలు ఏవి..!

KDP: చింతలమడుగుపల్లి ప్రధాన రహదారిలో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. సమీపంలో ఎంపీపీ పాఠశాల ఉండటంతో ఈగలు, దోమల వ్యాప్తి పెరిగి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాటసారులకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలన్నారు.