హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్లోసైన్‌ బోర్డుల ఫీజులు వసూలు చేయరా?'

WGL: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రకటనల బోర్డుల ఫీజుల వసూళ్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్లుగా ఫీజులు సక్రమంగా వసూలు చేయకపోవడంతో రూ.20 కోట్ల వరకు ఆదాయం కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేద,మధ్యతరగతి ప్రజల ఆస్తిపన్ను బకాయిలపై చర్యలు తీసుకుంటూ, వ్యాపారుల గ్లోసైన్‌ బోర్డుల ఫీజులు వసూలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.