హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాస్థాయి బాడ్మింటన్ ఎంపిక పోటీలు

MNCL: మంచిర్యాల పట్టణంలోని హైటెక్ కాలనీ ఆఫీసర్స్ క్లబ్‌లో మంగళవారం SGF జిల్లాస్థాయి బాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు SGF కార్యదర్శి యాకుబ్ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు అండర్-14,17 విభాగాల్లో బాలబాలికలకు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు రేపు ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.