హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సాపూర్ బస్టాండ్‌లో బాలుడు లభ్యం

MDK: నర్సాపూర్ బస్టాండ్‌లో 11-12 ఏళ్ల గుర్తుతెలియని బాలుడు లభ్యమైనట్లు ఎస్సై రంజిత్ రెడ్డి వెల్లడించారు. బ్లూ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించిన ఆ బాలుడికి మతిస్థిమితం లేకపోవడంతో మాట్లాడలేకపోతున్నాడని తెలిపారు. బాలుడిని గుర్తించినవారు వెంటనే నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లోగానీ, 8712657940 నంబర్‌కుగానీ సమాచారం అందించి సహకరించాలని కోరారు.