హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోనాపూర్ రైస్‌మిల్ వద్ద రోడ్డు ప్రమాదం

MDK: మెదక్-సిద్దిపేట రహదారిపై కోనాపూర్ రైస్‌మిల్ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక గేదె మృత్యువాత పడగా, మరో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. బర్రెల గుంపును వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఆటో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.